: మెస్సీ, అర్జెంటీనాకు శుభవార్త వినిపించిన ఫిఫా

అర్జెంటీనాకు చెందిన ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి ఫిఫా శుభవార్త వినిపించింది. అసిస్టెంట్ రిఫరీని దూషించిన ఘటనలో మెస్సీకి ఊరటనిచ్చింది. గత మార్చిలో జరిగిన మ్యాచ్ లో మెస్సీ అసిస్టెంట్ రిఫరీని దూషించాడు. దీనిపై విచారించిన రిఫరీ... మెస్సీపై నాలుగు అంతర్జాతీయ మ్యాచ్ ల నిషేధం విధించాడు. దీంతో వచ్చే ఏడాది సాకర్‌ వరల్డ్‌ కప్‌ అర్హత పోటీలు ఉండడంతో అర్జెంటీనా తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.

గత వరల్డ్ కప్ ఫైనల్ ముందు కూడా మెస్సీ గాయపడడంతో కప్ కు ఆ దేశం దూరమైంది. దీంతో ఈసారి అర్హత సాధిస్తామో లేదోనని ఆర్జెంటీనా ఫుట్ బాల్ సంఘం ఆందోళన చెందింది. అయితే తనపై విధించిన నాలుగు అంతర్జాతీయ మ్యాచ్ ల బ్యాన్ ను ఫిఫాలో మెస్సీ అప్పీలు చేసుకున్నాడు. మెస్సీ వివరణతో ఏకీభవించిన ఫిఫా...ఆధారాలు లేవని చెబుతూ అతనిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో మెస్సీతో పాటు, అర్జెంటీనా, ఫుట్ బాల్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News