: రెడీగా ఉండండి...ఏ క్షణంలోనైనా ఆదేశాలిస్తా...అనూహ్యంగా విరుచుకుపడాలి: కిమ్ జాంగ్ ఉన్

ఉత్తర కొరియా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా రాజకీయాన్ని నిశితంగా గమనిస్తున్న ఉత్తరకొరియా.. ఏమాత్రం వెనక్కి తగ్గే దిశగా ఆలోచించడం లేదు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో సమావేశమవుతానంటూనే... మరోపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దక్షిణ కొరియాకు 28 వేల మంది సైనికులు, జపాన్ కు 40 వేల మంది సైనికులను పంపడాన్ని ఉత్తరకొరియా తీవ్రంగా తూర్పారబట్టింది.

ఈ నేపథ్యంలో అమెరికా సెనెట్ సమావేశంలో ఐటీ దళాలు సిద్ధంగా ఉన్నాయని, ఉత్తరకొరియా వేసే బాంబులను పేలనివ్వమని సైనికాధికారులు పేర్కొన్న నేపథ్యంలో... ఓ చిన్న బోట్‌ లో రహస్యంగా తన సైన్యం వద్దకు వెళ్లిన ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్... అనూహ్య దాడులకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు, యుద్ధ విమానాలను ఏ క్షణానైనా వినియోగించే అవకాశం ఉందని, సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. దేశ రక్షణ కోసం దేనికైనా సిద్ధంగా ఉండాలని ఆయన తమ సైనికుల్లో స్పూర్తి నింపి వెనుదిరిగినట్టు సమాచారం.

More Telugu News