: కాల్ మాట్లాడిన వెంటనే ఎంత క్వాలిటీ ఉందో రేటింగ్ ఇవ్వచ్చు... ట్రాయ్ కొత్త యాప్

ఫోన్ లో కాల్ మాట్లాడుతుండగా సరిగా వినపడకపోవడం, మధ్యలో కాల్ కట్ కావడం, తదితర సమస్యలు మనకు ఎంతో చికాకు తెప్పిస్తుంటాయి. చికాకు పడటం తప్ప, అంతకు మించి మనం చేయగలిగేది ఏమీ లేదు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ సిద్ధమైంది. కాల్ మాట్లాడిన వెంటనే మనం ఎంత మాత్రం శాటిస్ ఫై అయ్యామో, కాల్ నాణ్యత ఎంత ఉందో వెంటనే రేటింగ్ ఇచ్చేయవచ్చు.

ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్ తీసుకొస్తోంది ట్రాయ్. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడంలో విఫలమైన టెలికాం కంపెనీలకు ఈ రేటింగ్ ద్వారా భారీ ఎత్తున ఫైన్ విధించేందుకు ట్రాయ్ సిద్ధమవుతోంది. మరోవైపు ఈ యాప్ ద్వారా 'డు నాట్ డిస్టర్బ్' ఆప్షన్ ను కూడా మెరుగుపరచనుంది. దీని ద్వారా అనవసరమైన కాల్స్, టెలీమార్కెటింగ్ కాల్స్ ను చెక్ పెట్టవచ్చు.


More Telugu News