: సైన్యంపై వ్యాఖ్యలు.. నవాజ్ షరీఫ్ పై పాకిస్థాన్ లో కేసు నమోదు

పాకిస్థాన్ లో సాక్షాత్తు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలను రెచ్చగొడుతూ, సైనిక దళాలపై విద్వేషాన్ని సృష్టిస్తున్నారంటూ ఇష్తియాక్ అహ్మద్ మీర్జా అనే న్యాయవాది రావల్పిండిలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తనకు వాట్సాప్ లో ఓ వీడియో క్లిప్ వచ్చిందని... అందులో నవాజ్ షరీఫ్ రెచ్చగొడుతున్నట్టు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను ఐఎం పాకిస్థాన్ పార్టీ ఛైర్మన్ గా ఆయన పేర్కొన్నాడు. తమ పార్టీ పాక్ ఎన్నికల కమిషన్ లో కూడా రిజిస్టర్ అయిందని చెప్పాడు. ఈ నేపథ్యంలో షరీఫ్ పై కేసు నమోదైంది. అయితే, షరీఫ్ పై నమోదైంది ఎఫ్ఐఆర్ కాదని... స్ధానికంగా దాన్ని రోజ్ నామ్చా అంటారని డాన్ పత్రిక తెలిపింది. 

More Telugu News