: ఎవరెస్ట్ శిఖరం వద్ద భారీ ట్రాఫిక్!

సాధారణంగా సిటీల్లో ట్రాఫిక్ భారీగా ఉండటం, ట్రాఫిక్ జామ్ కావడం సాధారణ అంశమే. కానీ, ప్రశాంతతకు మారుపేరైన ఎవరెస్ట్ వద్ద కూడా ట్రాఫిక్ సమస్య రాబోతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికంతా కారణం నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. ఈ ఏడాది ఎక్కువ మంది పర్యాటకులు ఎవరెస్ట్ ను సందర్శించుకునేందుకు అనుమతించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. 371 మంది విదేశీ పర్వతారోహకులకు నేపాల్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్టు అధికారులు, గైడ్స్ చెబుతున్నారు. 1953 నుంచి పోల్చితే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఎవరెస్ట్ మీదకు వీరు వెళ్లడానికి నేపాలీ షెర్పా గైడ్స్ సహాయపడతారు. ఈ నేపథ్యంలో, ఎవరెస్ట్ మీదకు దాదాపు 800 మంది చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో, ఎవరెస్ట్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు. 

More Telugu News