: అబుదాబిలో ఇద్దరు భారతీయుల తలరాత మార్చిన లాటరీ

ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన భారతీయ కార్మికుడిని అదృష్టలక్ష్మి వరించింది. దీంతో అతని తలరాత మారిపోయి... రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే... అబుదాబిలోని ఓ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌ గా పని చేస్తున్న తంగరాజ నాగరాజన్ (52) ని ‘మంత్లీ బిగ్ టికెట్ సిరీస్‌’ అనే లక్కీ లాటరీ వరించింది. ఈ లాటరీలో ప్రైజ్ మనీగా ఆయనకు మన కరెన్సీలో అక్షరాలా 8 కోట్ల 74 లక్షల రూపాయలు అందజేయనున్నారు.

లాటరీ గెలిచారన్న వార్త తెలియగానే...పట్టరాని సంతోషంతో నాగరాజన్‌ ఉప్పొంగిపోయారు. ఈ లాటరీ గెలుపొందిన 179వ వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. లాటరీ డబ్బుతో తన పిల్లలకు మంచి భవిష్యత్ అందిస్తానని అన్నారు. ఉన్నత చదువులు చదివిస్తానని ఆయన తెలిపారు. కాగా, గత నెలలో నిర్వహించిన మరో లాటరీని భారత్ కు చెదిన నిషిత రాధాక్రిష్ట పిల్లయ్ అనే మహిళ గెలుచుకుంది. ఈ లాటరీ ప్రైజ్ మనీ అక్షరాలా 17 కోట్ల రూపాయలు కావడం విశేషం. దీంతో వారి జీవితాలు మారిపోయాయి. కాగా, దుబాయ్ లో మలబార్ గోల్డ్ షోరూం నిర్వహించిన లాటరీలో మలయాళ హీరోయిన్ ను అరకేజీ బంగారం వరించిన సంగతి తెలిసిందే.

More Telugu News