: బెజవాడ దుర్గమ్మ సాక్షిగా దేవాలయంలో ఉద్యోగాల దందా!

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో దందా కొనసాగుతోంది. ఒక టీవీ చానెల్ ను ఆశ్రయించిన బాధితుల సాయంతో ఉద్యోగాల దందా వెలుగు చూసింది. కాంట్రాక్టు ఉద్యోగి ఒకరు ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను నమ్మబలికారు. కాంట్రాక్టు ఉద్యోగం చేస్తూ పర్మినెంట్ చేయించుకోవచ్చని ఆయన చెప్పాడు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించమని కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ కేబినెట్ సమావేశమైందని నమ్మబలికాడు. అందులో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు.

దీంతో త్వరలో కాంట్రాక్టు ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని, దుర్గ గుడిలో ఉద్యోగం కావాలంటే ఈవో, దేవాదాయ శాఖ మంత్రికి డబ్బులివ్వాల్సి ఉంటుందని చెప్పాడు. రిజిస్టర్ మెయింటైన్ చెయ్యడానికి పాత ఈవోకు కూడా కొంత ముట్టజెప్పాలని సూచించాడు. దీనికంతటికీ కొంత మొత్తం అవుతుందని, ఆ ఖర్చు భరిస్తే...గవర్నమెంటు ఉద్యోగం ఖాయమని నమ్మబలికాడు. దీంతో ఓ ఉద్యోగార్ధి ఆయనకు కొంత మొత్తం ఇవ్వడంతో మీడియా పోలీసులతో కలిసి వచ్చి, అతనిని పట్టించింది. అతని నుంచి 10,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామన్నారు. 

More Telugu News