: చంద్రబాబును కలిసి తమ ప్లాన్ వివరించిన గూగుల్ డిప్యూటీ చీఫ్ టామ్ మూర్

ఏపీ సీఎం చంద్రబాబునాయుడి తొలి రోజు అమెరికా పర్యటన విజయవంతమైంది. పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపి, నవ్యాంధ్రకు పెట్టుబడులతో రావాలని అభ్యర్థించారు. గూగుల్ ఉపాధ్యక్షుడు టామ్ మూర్ చంద్రబాబును కలిసి పలు అంశాలపై చర్చించారు. తమ నూతన ఆవిష్కరణల గురించి టామ్ వివరించగా, వాటిల్లో దేన్నైనా ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని, రాష్ట్రానికి వచ్చి స్థలాన్వేషణ సాగిస్తే, సెంటర్ ను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల అనుమతులనూ సత్వరమే మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఆపై గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించిన విషయమై, మంత్రి లోకేష్, కలెక్టర్ లతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై విచారాన్ని వ్యక్తం చేసిన ఆయన, బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు అన్ని రకాల వైద్య సేవలను అందించాలని సూచించారు.

More Telugu News