: ‘బంగినపల్లి’కి జియో ట్యాగ్.. ఇకపై ఏపీ రిజిస్టర్డ్ ప్రొప్రయిటర్!

బంగినపల్లి మామిడి పండు ఎంత తియ్యగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలోని కర్నూలు జిల్లాలో బంగినపల్లి మామిడి పండుతుంది. సుమారు వంద సంవత్సరాల చరిత్ర గల ‘బంగినపల్లి’కి జియో ట్యాగ్ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొందింది. దీంతో, ఏపీలో పండే పంటగా ‘బంగినపల్లి’కి సర్వత్ర గుర్తింపు లభిస్తుంది. ‘బంగినపల్లి’కి జియో ట్యాగ్ విషయమై చెన్నైలోని  ది రిజిస్ట్రార్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ ఓపీ గుప్తా కు ఏపీ హార్టికల్చర్ శాఖ నుంచి ఓ దరఖాస్తు అందింది.

‘బంగినపల్లి’ పంటకు ప్రధాన కేంద్రంగా రాయలసీమలోని కర్నూలు, ఆ తర్వాత పాణ్యం, నంద్యాల మండలాలు, ఈ పంట పండించే రెండో ప్రాంతంగా కోస్టల్ ఆంధ్రాను చేర్చుతూ ఏపీ ప్రభుత్వం సమర్పించిన దరఖాస్తులో పేర్కొంది. అంతేకాకుండా, జియో ట్యాగ్ పొందేందుకు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించింది. కాగా, జియోట్యాగ్ పొండడం ద్వారా వ్యాపారపరమైన అంశాల్లో ప్రయోజనం ఉంటుంది. రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉంటుంది.

More Telugu News