: క్లీన్ అండ్ గ్రీన్ సిటీ జాబితాలో విశాఖకు మంచి ర్యాంకు!

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన క్లీన్ సిటీల ర్యాంకుల్లో మధ్యప్రదేశ్ కు చెందిన ఇండోర్ క్లీన్ సిటీగా తొలి ర్యాంకును కైవసం చేసుకుంది. గత ఏడాది తొలి స్థానంలో ఉన్న మైసూరు ఐదో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్ 22వ స్థానంలో నిలిచింది.

విశాఖపట్నం దేశంలోని క్లీన్ సిటీ జాబితాలో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. నగరాల్లో ఉండే పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు, బహిరంగ మలమూత్ర విసర్జన ఏర్పాట్లు, రవాణా వ్యవస్థ, చెత్త నిర్వహణ అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాల్లో తిరుపతి (9), విజయవాడ (19), వరంగల్ (28), కాకినాడ (43), సిద్ధిపేట (45), రాజమండ్రి (46) స్థానాలను కైవసం చేసుకున్నాయి.

More Telugu News