: కోహ్లీ ఆ ఉద్దేశంతో నా కాళ్లను చూళ్లేదు...!: యాంకర్ అర్చన విజయ

వాక్చాతుర్యంతో పాటు మేని అందాలతో క్రికెట్‌ యాంకరింగ్‌ కు అందాలద్దిన అర్చనా విజయ ఈ మధ్యే ఐపీఎల్ సందర్భంగా కోహ్లీని ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా చిరుగుల జీన్ ను ధరించి కోహ్లీని ప్రశ్నించింది. ఎవరైనా ప్రశ్నిస్తే కళ్లలోకి చూసి సమాధానాలు చెప్పే కోహ్లీ... ఆ సమయంలో మాత్రం ఆమె కాళ్లవైపు చూస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీనికి నెటిజన్లు తమాషా కామెంట్లతో వైరల్ చేశారు.

దీనిపై అర్చనా విజయ మాట్లాడింది... 'దేవుడా! జనాలు శీర్షికల కోసం ప్రయత్నిస్తున్నారా? లేక మమ్మల్ని దిగజార్చాలని అనుకుంటున్నారా?' అంటూ ప్రశ్నించింది. విరాట్‌ గొప్ప క్రికెటర్‌ అని చెప్పింది.

 కోహ్లీని చూసి తామంతా స్ఫూర్తి పొందుతామని చెప్పింది. కోహ్లీ చూపు, ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయని చెప్పింది. ఇక సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఫోటో విషయానికి వస్తే.... నెటిజన్లు అనుకుంటున్న ఉద్దేశంతో కోహ్లీ తనను చూడలేదని చెప్పింది. అసలు కోహ్లీ చిరుగుల ప్యాంటు వెనుక ఉన్న తన కాళ్లను పరిశీలించడం లేదని... ఇంకా చెప్పాలంటే అసలు తన కాళ్లనే చూడలేదని తెలిపింది. తాను వెంటవెంటనే ప్రశ్నలు అడుగుతుండడంతో... తన ఒడిలో ఉన్న ప్రశ్నల ప్యాడ్‌ ను చూస్తున్నాడని వివరించింది. దీనికి నెటిజన్లు పెడార్థాలు తీస్తూ సోషల్ మీడియాలో అపార్థం చేసుకున్నారని తెలిపింది. కోహ్లీ తనకెంతో సన్నిహితుడని, ఆప్యాయంగా పలకరిస్తాడని, అతను మరో ఉద్దేశంతో చూడడని తేల్చిచెప్పింది. 

More Telugu News