: మా నాన్నను దెబ్బతీయాలనుకున్నవాళ్లు మట్టికరిచిపోతారు: నవాజ్‌ షరీఫ్‌ కూతురి మండిపాటు

తన తండ్రిని దెబ్బతీయాలనుకున్నవాళ్లు మట్టికరిచిపోతారని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియమ్‌ నవాజ్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆమె పెద్ద పెద్ద వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఏడాది ప‌నామా పేప‌ర్ల ద్వారా నవాజ్ ష‌రీఫ్ అక్ర‌మాస్తుల వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై న‌వాజ్ ష‌రీఫ్‌పై ప‌లువురు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ ఆయ‌న రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ష‌రీఫ్ కుమార్తె ప‌లు ట్వీట్లు చేశారు. పనామా పత్రాలు ఉత్త చెత్త అని ఆమె పేర్కొన్నారు. వాటిని చెత్తకుప్పలో వేయాలని, అస‌లు పనామా పత్రాలు అవినీతికి సంబంధించినవి కావని ఆమె ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

అయితే, దీనిపై జర్మన్‌ ఇన్వేస్టిగేటివ్‌ జర్నలిస్టు బాస్టియన్‌ ఒబెర్మేయర్ కూల్‌గా స్పందించారు. 'మీకు ఈ విషయం చెబుతున్నందుకు సారీ' అని అంటూ పనామా పత్రాలు అవినీతికి సంబంధించినవేన‌ని స‌మాధానం ఇచ్చారు. ఆశ్చర్యకరమైన రీతిలో అవినీతి కేసులను ఈ పత్రాల ద్వారా తాము కనుగొన్నామ‌ని,  అవ‌న్నీ నిజమైనవేన‌ని బదులిచ్చి ఝ‌ల‌క్ ఇచ్చారు.




More Telugu News