: మీ దగ్గర్లోని సెల్ టవర్ రేడియేషన్ ఎంతో తెలుసా?...ఇలా తెలుసుకోండి!

పట్టణాలు. పల్లెలు అన్న తేడా లేకుండా జనారణ్యంలో మొబైల్ టవర్లు వెలుస్తున్నాయి. నాణ్యమైన సేవల పేరిట జనాభా మధ్యలో మొబైల్ టవర్లు ఏర్పాటవుతున్నాయి. దీంతో సెల్ టవర్ కారణంగా పలు ఆరోగ్య సమస్యలు పీడిస్తున్నాయని, దీర్ఘకాల వ్యాధుల బారిన పడుతున్నామని పలువురు వాపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ప్రాంతంలో సెల్ టవర్ నుంచి వెలువడుతున్న రేడియేషన్ (అణుధార్మికత) నిర్ణీత పరిమితుల్లో ఉందా? లేదా? అనేది ఎప్పటికప్పుడు సరిచూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్‌ ను ప్రారంభించింది.

ఈ పోర్టల్ లో దరఖాస్తు దాఖలు చేస్తే... మీ ప్రాంతం లేదా మీకు సన్నిహితులు నివాసం ఉంటున్న ప్రాంతంలో అణుధార్మికత ఎంత ఉంది? అన్న విషయం చెబుతుంది. తరంగ్ సమాచార్ అనే ఈ పోర్టల్‌ ప్రారంభానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ...గ్వాలియర్ కు చెందిన కేన్సర్ రోగి (42) పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు మొట్టికాయల తీర్పుతో దీనిని హడావుడిగా ప్రారంభించారు. ఆ సెల్ టవర్ ను తక్షణం తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

More Telugu News