: వైజాగ్ లో విచ్చలవిడిగా బాహుబలి-2 సీడీలు

వైజాగ్ లో బాహుబలి-2: ద కన్ క్లూజన్ సినిమా పైరసీ సీడీలు విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ విభాగం... సీడీలు తయారు చేసి, విక్రయిస్తున్న దుకాణాలతో పాటు... సెల్ ఫోన్ షాపుల్లో కంప్యూటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 189 పైరసీ సీడీలను గుర్తించారు. అందులో 'బాహుబలి', 'బాహుబలి-2' హిందీ వెర్షన్‌, 'కాటమరాయుడు', 'ధ్రువ', 'రోగ్‌', 'ఘాజీ', 'ఫాస్ట్‌ అండ్ ఫ్యూరియస్‌', 'చెలియా', 'శివలింగ' తదితర సినిమాలకు సంబంధించిన సీడీలు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లను, నిందితులను గాజువాక, ద్వారకా పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. 

More Telugu News