: టాటా టెలీ సర్వీసులో ఉద్యోగాల కోత!

ప్రముఖ టాటా టెలి సర్వీస్ కంపెనీ తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులపై వేటు వేసింది. సుమారు ఆరు వందల మంది ఉద్యోగులను తొలగించింది. కాగా, టెలికం రంగంలో పోటీనీ తట్టుకోలేక, లాభాలు తగ్గుముఖం పట్టిన కారణంగానే ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపు ప్రభావం సేల్స్, ఇతర వర్గాలపై పడే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఉద్యోగుల తొలగింపు విషయమై టాటా టెలీ సర్వీసెస్ నుంచి అధికారిక సమాచారం లేదు. కాగా, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సమాచారం ప్రకారం, ఈ ఏడాది 28వ తేదీ వరకు టాటా మొబైల్ వినియోగదారుల సంఖ్య 51.2 మిలియన్లు.

More Telugu News