: చెన్నై, రాజస్థాన్ ఇన్.. పుణె, గుజరాత్ అవుట్: స్పష్టం చేసిన బీసీసీఐ

రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు వచ్చే సంవత్సరంలో బరిలోకి దిగుతాయని, ఇదే సమయంలో గతేడాది కొత్త జట్లుగా బరిలోకి దిగిన పుణె సూపర్ జెయింట్, గుజరాత్ లయన్స్ జట్లను తప్పిస్తామని బీసీసీఐ బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి వెల్లడించారు.

ఈ సంవత్సరంతో చెన్నై, రాజస్థాన్ జట్లపై నిషేధం ముగుస్తున్నందున వచ్చే సంవత్సరం ఈ రెండూ పునఃప్రవేశిస్తాయని, ఎనిమిది జట్ల సంఖ్యను 10కి పెంచాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం కాబట్టి, గుజరాత్, పుణె కొనసాగబోవని జోహ్రీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాదితో ఐపీఎల్ లోని పది సీజన్లూ ముగియడంతో, అందరు ఆటగాళ్లూ తిరిగి వేలం వేయబడతారని, ప్రతి జట్టూ కొత్తగా క్రికెటర్లను ఎంచుకోవచ్చని ఆయన అన్నారు. జట్ల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, తమకు మాత్రం అటువంటి ఆలోచన లేదన్నారు.

More Telugu News