: పెట్రోలు, డీజిల్ ధరల్లో రోజు వారీ పధ్ధతి... గందరగోళంగా ఉందంటున్న వైజాగ్ వాసులు!

దేశంలోని పాండిచ్చేరి, ఛండీగఢ్, జంషెడ్ పూర్, విశాఖపట్టణంలో ప్రయోగాత్మకంగా సరికొత్త ధరల విధానాన్ని ప్రవేశపెట్టాలని పెట్రోలియం శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి అమలులోకి వచ్చిన ఈ విధానంతో గందరగోళంగా ఉందని వైజాగ్ వాసులు చెబుతున్నారు. పెట్రోలు ధరలు రోజూ ఒకేలా ఉండడం వల్ల డీలర్లు, పెట్రోలు బంకుల యజమానులు మోసం చేస్తున్నారేమోనన్న అనుమానం నెలకొంటోందని చెప్పారు.

ఇప్పుడు ప్రతిదాని ధరలు ముందుగా తెలుసుకుని బంకుకు వెళ్లాల్సి వస్తోందని... ఒక ధర ఉండడం వల్ల ఇలాంటి అయోమయానికి తావుండేది కాదని పేర్కొంటున్నారు. దీనిపై పెట్రో డీలర్లు మాట్లాడుతూ, రోజుకో ధర ఉండడం వల్ల వైజాగ్ లో ధర పెరగగానే రూరల్ కు వెళ్లిపోయి పెట్రోలు పోయించుకుంటున్నారని, ధర తగ్గిందని తెలియగానే సిటీలో పెట్రోలు పోయించుకుంటున్నారని...ఈ విధానం వినియోగదారులకే కాకుండా తమకు కూడా ఇబ్బందిగా ఉందని తెలిపారు. ప్రతి రోజూ రేట్ డిస్ ప్లే చేయాల్సి వస్తోందని, బంకుకు వచ్చినవారంతా...అదేంటి...నిన్న తక్కువుంది కదా...ఇప్పుడేంటిలా? అని అనుమానంగా ప్రశ్నిస్తున్నారని వాపోయారు. 

More Telugu News