: ఉత్తరకొరియాకు భారత్ షాక్.. ఆ దేశ సైన్యానికి భారతీయ భాషలు నేర్పేది లేదని స్పష్టీకరణ

దక్షిణ కొరియా విన్నపంతో ఉత్తర కొరియాకు భారత్ షాకిచ్చింది. ఉత్తర కొరియా సైనికాధికారులకు భారతీయ భాషల్లో ఇస్తున్న శిక్షణను నిలిపేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర కొరియా సైనికాధికారులు 2008 నుంచి మహారాష్ట్రలో పలు దఫాలుగా భారతీయ భాషల్లో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఇటీవల అమెరికా సహా వైరి దేశం దక్షిణ కొరియాపై కారాలు మిరియాలు నూరుతోంది. దీంతో ఉత్తర కొరియా సైన్యానికి భారతీయ భాషలు నేర్పడం ఆపివేయాలని, ఆ దేశానికి ఎటువంటి సహాయ సహకారాలు చేయరాదంటూ ఇటీవల దక్షిణ కొరియా ప్రభుత్వం భారత్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో స్పందించిన భారత్ ఐక్యరాజ్య సమితి సూచనలు, దక్షిణ కొరియా విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని ఉత్తర కొరియా సైనికాధికారులకు భారతీయ భాషలపై ఇస్తున్న శిక్షణను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

More Telugu News