: భారత పర్యటనలో టర్కీ అధ్యక్షుడి వివాదాస్పద వ్యాఖ్యలు.. మధ్యవర్తిత్వానికి సై అన్న ఎర్డోగాన్

  భారత పర్యటనలో ఉన్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కశ్మీర్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి భారత్ తొలి నుంచీ నో చెబుతుండగా ఎర్డోగాన్ మాత్రం మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని ప్రకటించారు. అలాగే కశ్మీర్ అంశంపై బహుముఖ చర్చల ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనవచ్చని పేర్కొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్‌లు రెండూ తమకు మిత్ర దేశాలని, వాటి మధ్య చర్చల ప్రక్రియను మరింత బలోపేతం చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు.

తన తొలి అధికారిక విదేశీ పర్యటన సందర్భంగా ఆదివారం ఆయన భారత్ చేరుకున్నారు. మరోపక్క, ఎర్డోగాన్ మధ్యవర్తిత్వం వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ సీనియర్ అధికారి రిచీ ఘనశ్యామ్ కొట్టిపడేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం ప్రధాని మోదీతో ఎర్డోగాన్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఉగ్రావాదంపై పోరులో తాము భారత వెంట నిలుస్తామని ఎర్డోగాన్ పేర్కొన్నారు.

More Telugu News