: గుంటూరు జిల్లాలో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఒకరి మృతి!

గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. క్రోసూరులో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. క్రోసూరు నాలుగు రోడ్ల సెంటర్ లో ట్రాక్టర్ పై చెట్టు విరిగిపడింది. వర్షం కారణంగా అచ్చంపేట-సత్తెనపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, అచ్చంపేట మండలం పెదపాలెంలో పిడుగుపాటుకు రైతు నీలకంఠేశ్వర మృతి చెందాడు. మిర్చి కుప్పకు టార్పాలిన్ పట్టా కప్పేందుకు పొలానికి వెళ్లిన సమయంలో పిడుగు పడడంతో ఆయన మరణించాడు. అదేవిధంగా, చిలకలూరి పేటలోని నాదెండ్ల మండలం చిరుమామిళ్ల సమీపంలోని కెనాల్ దగ్గర కార్మికులు పని చేస్తున్న చోట పిడుగుపడటంతో 9 మంది కూలీలకు గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

More Telugu News