: అంకుల్!...వద్దంకుల్...ప్లీజ్ అంకుల్... మా నాన్న సంపేత్తాడంకుల్: పోలీసుల్ని బతిమాలిన పిల్లాడు

 ఓ చిన్న పిల్లాడు పోలీసులకు పట్టుబడి వేడుకున్న తీరు పోలీసులను నవ్వుల్లో ముంచెత్తింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...ఆదివారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఒక మైనర్ టూవీలర్ నడుపుతుండడం కంటబడింది. దీంతో వారు ఆ పిల్లాడిని ఆపారు. తాను ఏడవ తరగతి చదువుతున్నానని, మరోసారి నడపనని పోలీసులను కోరాడు.

అయితే పిల్లాడు మరోసారి ఇలా చేయకుండా ఉండాలంటే కొంచెం బెదిరించాలని భావించిన ఏలూరు టూ టౌన్ సీఐ బంగార్రాజు...సరే నీ అడ్రస్ చెప్పు ఇంట్లో దించేస్తాం అని చెప్పగానే ఏడుపులంకించుకున్నాడు. 'అంకుల్!...ప్లీజ్ అంకుల్...మళ్లీ ఇలా చేయనంకుల్... మీరు రావద్దంకుల్...మానాన్న సంపేత్తాడంకుల్' అంటూ బతిమాలడం ప్రారంభించాడు. దీంతో చుట్టూ ఉన్న పోలీసులు నవ్వుకున్నారు. మరోసారి ఇలా చేయవద్దని, అలా చేయడం ప్రమాదకరమని హెచ్చరించి పిల్లాడిని విడిచిపెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో అంతా నవ్వుకుంటున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూడండి.

More Telugu News