: చట్టాలను పాటించకుండా సౌదీలో కాలుమోపిన జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్... స్వాగతం పలికిన రాజు సల్మాన్

చమురు నిల్వలు పుష్కలంగా ఉన్న ముస్లిం దేశం సౌదీ అరేబియా పర్యటనకు వచ్చిన జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్, మహిళల పట్ల ఆ గడ్డపై అమలవుతున్న కఠిన నిబంధనలను ఎంతమాత్రమూ పట్టించుకోలేదు. జుట్టు కనిపించకుండా స్కార్ఫ్ ధరించాలని సౌదీ నిబంధనలు చెబుతున్నా, మెర్కెల్ ఎటువంటి స్కార్ఫ్ లేకుండానే సౌదీ గడ్డపై కాలుమోపారు. జెడ్డాలో ఆమె ల్యాండ్ కాగానే, ఆ దేశ రాజు సల్మాన్ స్వయంగా స్వాగతం పలికారు.

కాగా, గతంలో సౌదీలో పర్యటించిన విదేశీ మహిళా నేతలు సైతం అక్కడి ప్రొటోకాల్ ను పాటించిన దాఖలాలు లేవు. హిల్లరీ క్లింటన్, మిచెల్ ఒబామా వంటి వారు సౌదీకి వచ్చినప్పుడు కురులను కప్పుకునేలా ఎలాంటి స్కార్ఫ్ లూ ధరించలేదు. జర్మనీలో బుర్ఖాలను ధరించడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, పలు ద్వైపాక్షిక అంశాలు, పెట్టుబడులు సహా, అనేక ఇతర విషయాలపై మెర్కెల్ సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు.

More Telugu News