: ఆర్టీసీని దివాకర్ రెడ్డికి, స్కూళ్లను నారాయణకు అమ్మేయాలని చూస్తున్నారు: గుంటూరు మేడే ఉత్సవాల్లో జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలనపై రాష్ట్రంలోని ఏ వర్గమూ సంతోషంగా లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. గుంటూరులో మేడే ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీని జేసీ దివాకర్ రెడ్డికి, స్కూళ్లను నారాయణకు, ఏపీ జెన్ కో, ఏపీ ట్రాన్స్ కో ను సీఎం రమేష్ కి లేదా సుజనా చౌదరికి అమ్మేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం అని చెప్పిన చంద్రబాబు, రాష్ట్ర ప్రజలను ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినట్టు మోసం చేశారని అన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని తాము చంద్రబాబుకు చెబుతున్నామని అన్నారు. చంద్రబాబు రైతులకు మద్దతు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రైతు ఆత్మహత్యల నివారణకు తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. 

More Telugu News