: టైమ్ మెషీన్ సాధ్యమే... కానీ ఇప్పట్లో తయారుచేయలేం: అమెరికా శాస్త్రవేత్త

టాలీవుడ్ అగ్రనటుడు బాలకృష్ణ, మోహిని, మాస్టర్ తరుణ్, సిల్క్ స్మిత, టిను ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించగా, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన 'ఆదిత్యా 369' సినిమా గుర్తుందా?... అందులో పిల్లలను కాపాడే క్రమంలో బాలకృష్ణ, మోహిని, సుత్తివేలు టైమ్ మెషీన్ లో చిక్కుకుపోయి శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్లిపోవడం, ఆ తరువాత దాని నుంచి భవిష్యత్ కాలంలోకి వెళ్లడం... ఆ తరువాత మళ్లీ తన కాలంలోకి వెళ్లడం జరుగుతుంది. ఈ సినిమా తెలుగు పరిశ్రమలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమా తరహాలో గతం లేదా భవిష్యత్తులోకి తీసుకెళ్లే టైమ్‌ మెషిన్‌ ను తయారు చేయడం ప్రస్తుతానికి అసాధ్యమని అమెరికాలోని వర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా ఇన్ కెనడాకు చెందిన శాస్త్రవేత్త బెన్ టిప్పెట్ తెలిపారు.

ఈ మెషీన్ తయారీకి అవసరమైన గణిత, భౌతిక సిద్ధాంతాన్ని బెన్‌ టిప్పెట్‌ అభివృద్ధి చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఇలాంటి టైమ్ మోషీన్ ను తయారు చేయడం సాధ్యం కాదని భావిస్తున్నామని అన్నారు. ఎందుకంటే దీనిని ప్రస్తుతానికి తయారు చేయలేమని తెలిపారు. అలాంటి మెషీన్ ను తయారు చేసేందుకు అవసరమైన వస్తు సామగ్రి మన దగ్గర లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే గణితశాస్త్రం ప్రకారం టైమ్‌ మెషీన్‌ ను తయారు చేయడం సాధ్యమేనని ఆయన స్పష్టం చేశారు.

ఐన్‌ స్టీన్‌ సిద్ధాంతం ప్రకారం అంతరిక్షం, సమయంలో వక్రీకరణల వల్ల గురుత్వాకర్షణ క్షేత్రాలు ఏర్పడ్డాయి. ఈ సిద్ధాంతం ఆధారంగా జరిపిన పరిశోధనల్లో లిగో సైంటిఫిక్‌ బృందం కొన్ని కాంతి సంవత్సరాల క్రితం కృష్ణబిలాలు ఢీకొనడంతో ఏర్పడ్డ∙గురుత్వాకర్షణ తరంగాల్ని గుర్తించింది. లిగో సైంటిస్టులు కనుగొన్న విషయాన్ని...ఐన్‌ స్టీన్‌ సూత్రీకరించిన సిద్ధాంతాన్ని ఉపయోగించి అంతరిక్ష సమయాన్ని వలయాకారంలోకి మార్చడం ద్వారా గతం లేదా భవిష్యత్తులోకి ప్రయాణించవచ్చని, దానిని సాధ్యం చేయడం అసాధ్యం కాదని టిప్పెట్‌ తెలిపారు. 

More Telugu News