: కోర్టులో మాటిస్తే నెరవేర్చాల్సిందే.. మాటతప్పిన పిటిషనర్‌ను అదుపులోకి తీసుకోవాలంటూ సుప్రీం ఆదేశం

కోర్టు సమక్షంలో హామీ ఇచ్చి తప్పిన ఓ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. జడ్జిల సమక్షంలో చెప్పిన మాటకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దానిని విస్మరించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. తానుంటున్నఇంటి అద్దె బకాయిలను యజమానికి చెల్లిస్తానంటూ సుదీందర్ సింగ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోని ఆయన అద్దె బకాయిలు చెల్లించలేదు. దీంతో ఇంటి యజమాని మరోమారు కోర్టును ఆశ్రయించాడు. దీంతో స్పందించిన చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం మాటతప్పిన పిటిషనర్‌ను వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించింది.

More Telugu News