: ఇక భారత్‌ను చూస్తే ప్రపంచానికి వణుకే.. పరీక్షకు సిద్ధమైన బ్రహ్మోస్ ఎయిర్ వెర్షన్.. ప్రపంచంలో ఆ శక్తి మనకే సొంతం!

భారత్ అత్యంత శక్తిమంతమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఎయిర్ వెర్షన్ పరీక్షలకు సిద్ధమైంది. శత్రుదేశాలకు వణుకు పుట్టిస్తున్న అత్యంత శక్తిమంతమైన ఈ క్షిపణిని జూన్‌లో విమానం నుంచి పరీక్షించనున్నారు. తొలుత సుఖోయ్ యుద్ధవిమానం నుంచి రెండుసార్లు సాధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత లైవ్ టార్గెట్‌పై పరీక్ష నిర్వహించనున్నట్టు రక్షణ వర్గాలు తెలిపారు.

అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని, సుఖోయ్ యుద్ధ విమానంతో బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా అనుసంధానం చేసినట్టు బ్రహ్మోస్ ఏరోస్పేస్ అధికారులు పేర్కొన్నారు. టెస్ట్-ఫైర్ విజయవంతమైతే ప్రపంచంలోనే ఈ తరహా శక్తికలిగిన దేశంగా భారత్ అవతరిస్తుంది. భూమి, సముద్రం, ఆకాశం నుంచి ప్రయోగించగలిగే క్షిపణి వ్యవస్థ ఇప్పటి వరకు ప్రపంచంలోనే లేదు. దీంతో బ్రహ్మోస్ అంటేనే చాలా దేశాలు వణుకుతున్నాయి.

More Telugu News