: గెట్ రెడీ... పాక్ తో 10, చైనాతో 15 రోజుల యుద్ధానికి సిద్ధం కావాలని కమాండర్లకు ఎయిర్ ఫోర్స్ ఆదేశాలు

పొరుగున ఉన్న పాకిస్థాన్ తో పది రోజుల పాటు, చైనాతో 15 రోజుల పాటు యుద్ధం చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని తన కమాండర్లకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో ఐఏఎఫ్ కమాండర్ల సదస్సు జరుగగా, ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా ఈ మేరకు కమాండర్లకు సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. యుద్ధం సంభవిస్తే, పాక్ ను పది రోజుల పాటు, చైనాను 15 రోజుల పాటు ఎదుర్కోవడానికి వీలుగా కమాండర్లు సిద్ధంగా ఉండాలని, పోరాట సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన సూచించినట్టు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి.

అందుబాటులోని యుద్ధ విమానాలు, పూర్థి స్థాయి ఆయుధాలు, క్షిపణులు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. శత్రుదేశాల నుంచి దూసుకు వచ్చే క్షిపణులపై సమాచారాన్ని అందించే అలర్ట్ రాడార్ సిస్టమ్ ను రెడీగా ఉంచాలని ఆయన సూచించారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఇన్స్ పెక్షన్ కు ఆదేశాలు ఇస్తూ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సన్నద్ధం కావలని ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది.

More Telugu News