: హైదరాబాద్ లో రాత్రి భారీ వర్షం... తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

గత రాత్రి 12 గంటల నుంచి మూడు గంటల వరకూ హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అమీర్ పేట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, దిల్ సుఖ్ నగర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఈ ఉదయాన్నే బయటకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీల మరమ్మతుల పనులు చేసేందుకు గుంతలు తీసి ఉండటంతో వాటిల్లో నీరు నిండిపోయి, పనులు ఆగిపోయాయి.

కాగా, రెండు రాష్ట్రాల్లో ఎండ తీవ్రతకు తోడు సముద్రం మీదుగా తేమగాలులు వీస్తుండటంతో, అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న కర్నూలు జిల్లాలోని కంబదూర్‌ లో 3 సెంటీమీటర్లు, ఎమ్మిగనూరులో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లోని పలుప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

More Telugu News