: క్షణక్షణం నరాలు తెగే ఉత్కంఠ... సూపర్ ఓవర్ లో బుమ్రా మ్యాజిక్... గుజరాత్ పై ముంబై గెలుపు

పొట్టి క్రికెట్ లో ఎంతటి మజా ఉందో తెలిసొచ్చింది. ఓ వైపు ఈ సీజన్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టు.. మరోవైపు కొత్త కుర్రాళ్లతో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్. ఐపీఎల్ లో భాగంగా రాజ్ కోట్ లో జరిగిన మ్యాచ్ లో చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేయగా, సరిగ్గా 20వ ఓవర్ ఆఖరి బంతికి ముంబై 153 పరుగుల వద్ద ఆలౌటైంది.

దీంతో సూపర్ ఓవర్ ఆడించాలని అంపైర్లు నిర్ణయించగా, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 5 బంతులను మాత్రమే ఆడగలిగింది. పొలార్డ్, బట్లర్ వికెట్లు పడిపోవడంతో 11 పరుగులే చేసింది. ఆపై గుజరాత్ ఆటగాళ్లకు బౌలింగ్ చేసిన బుమ్రా తన అద్భుత బౌలింగ్ తో బంతి సమీపానికి కూడా ఆటగాళ్లను రానీయలేదు. దీంతో ముంబై జట్టు విజయాన్ని అందుకోగా, ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచిన కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

గుజరాత్ ఆటగాళ్లలో మెకల్లమ్, రైనా, ఫించ్, దినేష్ కార్తీక్ లు రెండంకెల స్కోరును అందుకోనప్పటికీ, యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడి 48 పరుగులు చేయడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరును అందుకుంది. ముంబై జట్టులో పార్థివ్ ఒక్కడే 70 పరుగులతో రాణించాడు.

More Telugu News