: పద్దెనిమిది రోజుల తర్వాత... లండన్ నుంచి చైనాకు చేరుకున్న రైలు!

ప్రపంచంలోనే రెండో పొడవైన రైలు మార్గం గుండా సుమారు 12 వేల కిలోమీటర్లు ప్ర‌యాణించి యూకే నుంచి నేరుగా చైనాకు రైలు వ‌చ్చింది. పశ్చిమ ఐరోపా దేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు చైనా ఈ రైలు మార్గాన్ని నిర్మించింది. ప్ర‌యోగాత్మ‌కంగా ఈ నెల 10న బ‌య‌లుదేరిన‌ ఈ రైలు పద్దెనిమిది రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ రోజు చైనాలోని ఇవు నగరానికి చేరుకుంది. నాలుగేళ్ల క్రితం చైనా మొద‌లుపెట్టిన‌ వన్ బెల్ట్, వన్ రోడ్ విధానం నేప‌థ్యంలో ఈ రైలు మార్గాన్ని అభివృద్ధి చేశారు.

12,000 కిలోమీటర్ల నుంచి వ‌స్తువుల‌ను అతి త‌క్కువ ఖ‌ర్చుతో రైలు ద్వారా తీసుకురావ‌చ్చ‌ని చైనా పేర్కొంది. కార్గో విమానాల కన్నా తక్కువ ఖర్చుతోను, నౌకల ద్వారా కంటే తక్కువ సమయంలోనూ సరకులను ఎగుమ‌తి, దిగుమ‌తి చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. యూకే నుంచి చైనాకు ఈ రైలు 88 కంటైనర్లతో విస్కీ, బేబీ మిల్క్, ఫార్మసూటికల్స్ తదితర సరకులతో బ‌య‌లుదేరింది. ఈ రైలు ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, పోలాండ్, వెలారస్, రష్యా, కజఖస్థాన్ మీదుగా చైనా చేరిందని అక్క‌డి అధికారులు చెప్పారు.

More Telugu News