: ఆ చిన్నారి నిద్ర పోయేది రోజుకి ఓ గంట లేదా గంటన్నర... అంతే!

అందరి చిన్నారుల్లా ఈ చిన్నారి నిద్రపోదు. మహా అయితే .. రోజు మొత్తం మీద, ఓ గంట లేదా గంటన్నరో నిద్రపోతుంది. కెనడాకు చెందిన ఈ మూడేళ్ల చిన్నారి పేరు ఎవర్. పగలు, రాత్రి ఈ పాప అందరి చిన్నారుల్లా నిద్రపోదు. రాత్రి సమయంలో ఒక గంట లేదా గంటన్నర పాటు నిద్రపోతుంది, అంతే! ఆ తర్వాత లేచి కూర్చుంటుంది. దీంతో, ఎవర్ తల్లిదండ్రులు రాబిన్ ఆడెట్టే, కిర్క్ హిస్కో కంగారు పడిపోయారు. వైద్యులను సంప్రదించి ఈ విషయాన్ని చెప్పగా.. ఏంజెల్మాన్ సిండ్రోమ్ తో ఎవర్ బాధపడుతోందని, జన్యు, నాడీ సంబంధమైన వ్యాధి కారణంగా చిన్నారికి నిద్రపట్టడం లేదని చెప్పారు. అయితే, ఈ వ్యాధి నుంచి ఎవర్ ను బయటపడ వేసేందుకు చికిత్స అందిస్తున్నట్లు చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు.

More Telugu News