: చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన వినోద్ ఖన్నా!

ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా తన చివరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు. పాకిస్థాన్ లోని ఖైబర్ ఫక్తుంక్వా ప్రాంతంలోని పెషావర్ లో ఉన్న తన పూర్వీకుల ఇంటిని సందర్శించాలని ఆయన కలలుగనేవారు. ప్రస్తుతం ఈ భవనాన్ని ఆల్ పాకిస్థాన్ విమెన్ అసోసియేషన్ ఉపయోగించుకుంటోంది. వినోద్ ఖన్నా తండ్రి పెషావర్ లో ప్రముఖ వ్యక్తిగా ఉండేవారు. దేశ విభజన సమయంలో 1947లో వినోద్ ఖన్నా ఏడాది బాబుగా ఉన్నప్పుడు అతని తండ్రి భారత్ కు వచ్చేశారు. 1946లో పెషావర్ కంటోన్మెంట్ లోని సర్దార్ ఏరియాలో ఖన్నా జన్మించారు.

ఖైబర్ ఫక్తుంక్వా కౌన్సిల్ హెరిటేజ్ కల్చరల్ జనరల్ సెక్రటరీ షకీల్ వహీదుల్లా మాట్లాడుతూ, 2014లో తాను భారత్ సందర్శించిన సందర్భంగా వినోద్ ఖన్నాను కలిశానని చెప్పారు. తనకు ఆటోగ్రాఫ్ ఇస్తూ, పెషావర్ ప్రజలకు ఖన్నా శుభాకాంక్షలు తెలిపారని గుర్తు చేసుకున్నారు. ఎప్పటికైనా పెషావర్ రావాలనే కోరికను తనతో చెప్పారని వెల్లడించారు. పెషావర్ సందర్శన కోసం పాక్ ప్రభుత్వానికి విన్నవించుకున్నారని తెలిపారు. కానీ, ఆయన చివరి కోరిక తీరకుండానే చనిపోవడం తమకు ఎంతో ఆవేదనను కలిగిస్తోందని చెప్పారు. వినోద్ ఖన్నా గౌరవార్థం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

More Telugu News