: ఖ‌మ్మం వ్య‌వ‌సాయ‌ మార్కెట్‌లో విధ్వంసం సృష్టిస్తున్న రైతులు

కష్టించి పండించిన మిర్చి పంట చేతికి వ‌చ్చింది. తాము ఇన్ని నెల‌లూ ప‌డ్డ క‌ష్టానికి ఫ‌లితం వ‌స్తుంద‌ని ఎన్నో ఆశ‌ల‌తో ఖ‌మ్మం మార్కెట్ యార్డుకి వ‌చ్చిన రైతులకు నిరాశే మిగ‌ల‌డంతో వారి కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. గిట్టుబాటు ధ‌ర రాక‌పోవ‌డంతో మార్కెట్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారు. మార్కెట్‌లో ఉన్న మూడు భ‌వ‌నాల అద్దాలు, అందులోని కంప్యూట‌ర్లు, ఫ‌ర్నిచ‌ర్‌ను ధ్వంసం చేశారు. ప‌లు వ‌స్తువుల‌కి నిప్పుపెట్టారు. రైతుల సంక్షేమం, గిట్టుబాటు ధ‌ర అంటూ ఎన్నో మాట‌లు చెబుతున్న ప్ర‌భుత్వం... మ‌రోవైపు త‌మ‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మార్కెట్ యార్డు చైర్మన్ కార్యాలయాన్ని చుట్టుముట్టి రాళ్లతో దాడికి దిగారు. ఈ రోజు స‌ద‌రు మిర్చి యార్డుకు 2.5 లక్షల బస్తాలు వచ్చాయి. దీంతోనే ధర పతనమైనట్లు తెలుస్తోంది. రేపు ఎల్లుండి మార్కెట్‌కు సెలవు దినాలు కాబ‌ట్టి ఈ రోజు త‌మ మిర్చీని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ స‌మాచారం అందుకున్న‌ పోలీసులు మార్కెట్‌కు భారీగా చేరుకున్నారు. రైతుల‌ను అదుపు చేసేందుకు య‌త్నిస్తున్నారు.

More Telugu News