: 'దళిత' అనే పదాన్ని ఉపయోగించవచ్చా?: ఢిల్లీ హైకోర్టు

దళిత అనే పదాన్ని వార్తా కథనాల్లో వినియోగించడంపై అభిప్రాయాన్ని తెలపాలంటూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. వాస్తవానికి పీసీఐ నిబంధనల ప్రకారం 'షెడ్యూల్డ్ కులాలు' అనే పదాన్ని వినియోగించడం కూడా నిషేధమేనని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ అను మల్హోత్రాల ధర్మాసనం పేర్కొంది. దళిత అనే పద వినియోగంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. ఈ పిటిషన్ కు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని పీసీఐను ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది.

More Telugu News