: లాతూర్ లో మరో ఘోరం... పిట్టలు రాలిపోయాయి!

అకస్మాత్తుగా ప్రకృతి వైపరీత్యం సంభవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతే... అలాంటి సమయంలో మనుషులు పిట్టల్లా రాలిపోయారని అంటుంటాం. అయితే ఇది సామెత అయినప్పటికీ మహారాష్ట్రలోని లాతూర్ లో పిట్టలు రాలిపోవడం అంటే ఏంటో నిజంగానే కనిపించింది. దేశంలోని నీటి ఎద్దడి అధికంగా ఉండే ప్రాంతాల్లో లాతూర్ ప్రాంతం ఒకటన్న సంగతి తెలిసిందే. నీటి చుక్క ఎక్కడా లభ్యం కాకపోవడంతో మనుషులు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటుండగా, వివిధ జాతులకు చెందిన పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. వందలాది పక్షులు కళ్ల ముందే రాలిపోవడంతో లాతూర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండుటాకుల్లా రాలిపోయిన పక్షులను చూసి... అక్కడి ప్రజలు కంటతడిపెట్టారు. 

More Telugu News