: చిరంజీవి రికార్డును కొల్లగొట్టిన ప్రభాస్... బాహుబలి ఖాతాలో మరో రికార్డు

'బాహుబలి: ద బిగెనింగ్' సినిమాతో మెదలుపెట్టిన రాజమౌళి ప్రభంజనం 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' వరకు కొనసాగుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో రికార్డులన్నీ సొంతం చేసుకుని దూసుకుపోతున్న 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' తన ఖాతాలో మరో రికార్డును వేసుకుంది. ఈ మధ్యే పునఃప్రవేశంతో రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఓవరాల్ కలెక్షన్లను, ప్రీ బుకింగ్స్‌ తోనే 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' కొల్లగొట్టడం విశేషం.

అమెరికాలో ఖైదీ నెంబర్ 150 సినిమా 2.45 మిలియన్ డాలర్లు (15 కోట్ల 70 లక్షల రూపాయలు) వసూలు చేయగా, 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' అమెరికాలో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ తో ఏకంగా 3 మిలియన్ డాలర్ల (దాదాపు 19 కోట్ల రూపాయలు) వసూళ్లు రాబట్టిందని ఆ దేశంలో 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గ్రేట్ ఇండియన్ ఫిల్మ్స్ సంస్థ ప్రకటించింది. రికార్డు స్థాయిలో యూఎస్ లో గంటలకు 64 లక్షల రూపాయల విలువ చేసే టికెట్స్ బుక్ అవుతున్నాయని వారు వెల్లడించారు. 

More Telugu News