: అమరావతిని హైదరాబాద్‌లా మార్చొద్దు.. సీఆర్‌డీఏ అధికారులకు సూచించిన హైకోర్టు

అక్రమ నిర్మాణాల విషయంలో రాజీపడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మరో హైదరాబాద్ చేయవద్దంటూ సీఆర్‌డీఏ అధికారులకు హైకోర్టు సూచించింది. సరైన ప్రణాళిక లేకుండా హైదరాబాద్ అభివృద్ధి జరగడంతో నగరం కళ కోల్పోయిందని, ఏపీ రాజధాని విషయంలో అటువంటి పొరపాట్లకు తావివ్వవద్దని పేర్కొంది. పక్కా ప్రణాళికతో అధికారులు చక్కని సమన్వయంతో పనిచేసి అమరావతిని ఆదర్శ రాజధానిగా తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకు చక్కని వాతావరణం కల్పించాలని హైకోర్టు పేర్కొంది.

సీఆర్‌డీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తుండడంతో 2016లో పలువురు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర స్టే ఉత్వర్వులు పొందారు. ఇలా దాఖలైన మొత్తం 50 పిటిషన్లు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. వీటి విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల విషయంలో అస్సలు రాజీపడవద్దని పేర్కొంది. అనంతరం సీఆర్‌డీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై వేసవి సెలవుల తర్వాత రోజువారీ విచారణ చేపడతామని జస్టిస్ చల్లా కోదండరాం గురువారం ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News