: గోడ కడతాన్న ట్రంప్ పై ‘ఆమ్నెస్టీ’ వినూత్న నిరసన!

అమెరికా-మెక్సికో సరిహద్దు మధ్య గోడ కడతానని చెప్పిన యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎన్జీవో సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఈ సంస్థకు చెందిన సుమారు వంద మంది మహిళలు ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ వేషధారణలో లండన్ లోని యూఎస్ రాయబార కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వీరు ఓ చేతిలో కాగడా, మరో చేతిలో ‘నో బ్యాన్.. నో వాల్’,‘శరణార్థులకు స్వాగతం’ అని రాసి ఉన్న కార్డులను పట్టుకున్నారు. కాగా, అమెరికా-మెక్సికో సరిహద్దు మధ్య గోడ కట్టడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, అందుకనే, ఈ విషయాన్ని ట్రంప్ పక్కన పెట్టేశారనే వార్తలు హల్ చల్ చేశాయి. ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ ‘గోడ కట్టి తీరతాం’ అని ట్రంప్ నిన్న మరోమారు స్పష్టం చేయడం విదితమే.

More Telugu News