: ఇప్పుడైతే నా చేతిలో మూడు బాలీవుడ్‌ చిత్రాలు ఉన్నాయి: ప్రియాంక చోప్రా

హాలీవుడ్ సినిమా ‘బేవాచ్‌’తో పాటు అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘క్వాంటికో’తో బిజీబిజీగా గడిపేసిన నటి ప్రియాంక చోప్రా ఎంతో కాలంగా ఏ బాలీవుడ్ చిత్రానికీ ఒప్పుకోలేదు. అయితే, బాలీవుడ్‌ చిత్రంలో న‌టించేందుకు ప్ర‌స్తుతం తాను కొన్ని క‌థ‌లు వింటున్నాన‌ని ప్రియాంక చెప్పింది. కొంద‌రు న్యూయార్క్‌ వచ్చి మరీ త‌న‌కు కథలు చెబుతున్నారని, వాటిల్లో త‌న‌కు కొన్ని నచ్చాయని తెలిపింది. అయితే, ‘క్వాంటికో’ మూడో సీజన్‌పై స్ప‌ష్ట‌త‌ వస్తేనే తాను ఆ విష‌యంలో ముందడుగు వేయగలనని, ఇప్పుడైతే తన‌ చేతిలో మూడు బాలీవుడ్‌ చిత్రాలు ఉన్నాయని తెలిపింది. కానీ వాటిపై ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయలేనని తేల్చి చెప్పింది.


More Telugu News