: హవాయి చెప్పులు ధరించేవారూ విమానమెక్కే రోజులొచ్చాయి: మోదీ

భారతావనిలో దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా విమానాలు ఎక్కే రోజులు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి షిమ్లాకు కేవలం రూ. 2,500 టికెట్ ధరపై తొలి 'ఉడాన్' (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) విమానాన్ని ఆయన ప్రారంభించారు. హవాయి చెప్పులు ధరించేవారు కూడా హవా (గాల్లో)లో ప్రయాణించవచ్చని ఆయన అన్నారు. రీజనల్ కనెక్టివిటీని పెంచాలని నిర్ణయించామని, ప్రపంచంలోనే ఈ తరహా విధానం ప్రప్రథమమని అన్నారు. గత సంవత్సరం జూన్ 15న విడుదల చేసిన జాతీయ పౌర విమానయాన విధానంలో భాగంగా గంట ప్రయాణం లేదా 500 కిలోమీటర్ల దూరానికి రూ. 2,500 టికెట్ గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పశ్చిమ భారతావనిలో 24 ఎయిర్ పోర్టులు, ఉత్తరాదిన 17, దక్షిణాదిన 11, తూర్పు ప్రాంతాన 12, ఈశాన్యాన 6 విమానాశ్రయాల నుంచి లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సేవలు నడుస్తాయని అధికారులు తెలిపారు.

More Telugu News