: బెనిఫిట్ షోలపై ఏం చేద్దాం? ... తలసాని సీరియస్ వార్నింగ్ తో ఆలోచనలో నిర్మాతలు.. ఆందోళనలో అభిమానులు!

రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన 'బాహుబలి-2' చిత్రం బెనిఫిట్ షోలకు తెలంగాణలో ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదని, నిబంధనలను అతిక్రమిస్తే, థియేటర్ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు తప్పవని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ వార్నింగ్ ఇవ్వడంతో, ఇప్పటికే వేలాది టికెట్లను ప్రీమియర్ షోల పేరిట విక్రయించిన నిర్మాతల్లో ఆందోళన పెరిగింది.

హైదరాబాద్ లో ప్రసాద్ ఐమాక్స్ లో నేటి రాత్రి 10 గంటల నుంచి ఆరు ప్రీమియర్ షోలకు టికెట్లను విక్రయించారు. ఐనాక్స్ జీవీకే వన్ లో రాత్రి 9:45, 10 గంటలకు రెండు షోలు, టివోలీ సినిమాలో రాత్రి 9:30, 9:45 గంటలకు, ఏసియన్ ఎం క్యూబ్ మాల్ లో రాత్రి 9:45 గంటలకు, సంధ్య 70 ఎంఎంలో రాత్రి 9:00 గంటలకు, సినీపోలిస్ మంత్రా మాల్ లో రాత్రి 9:05, 10:25 గంటలకు, సినీపోలిస్ సీసీపీఎల్ మాల్ లో రాత్రి 9:50 నుంచి ఐదు షోలకు, ఏషియన్ స్వప్న థియేటర్లలో రెండు షోలకు, బీవీకే మల్టీప్లెక్స్ లో మూడు షోలకు టికెట్లను విక్రయించారు. ఈ అన్ని థియేటర్లలో చిత్రాన్ని ముందుగా ప్రదర్శిస్తే కఠిన చర్యలుంటాయని తలసాని స్పష్టం చేయడంతో, అటు నిర్మాతల్లో, ఇటు టికెట్లు కొన్న అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయమై బాహుబలి టీమ్ స్పందించాల్సి వుంది.

More Telugu News