: ఒక్క సంతకంతో యూపీ సీఎం తొలగించిన 15 సెలవుల జాబితా ఇది

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, పాలనలో తనదైన శైలిలో దూసుకుపోతున్న యోగి ఆదిత్యనాథ్, దేశంలో ఎక్కడాలేని విధంగా, తన రాష్ట్రంలో అమలవుతున్న సెలవుల సంస్కృతికి చరమగీతం పాడారు. ఒక్క సంతకంతో 15 పబ్లిక్ హాలిడేస్ ను రద్దు చేశారు. రద్దయిన సెలవుల జాబితాలో, జన నాయక్ కర్పూరీ ఠాకూర్ జయంతి (జనవరి 24), మహర్షి కశ్యప అండ్ మహారాజ్ గుహ జయంతి (ఏప్రిల్ 5), హజ్రత్ ఖావాజా మొయినుద్దీన్ చిస్తీ అజ్మీరి గరీబ్ నవాజ్ ఉర్సు (ఏప్రిల్ 14), చంద్రశేఖర్ ఆజాద్ జయంతి (ఏప్రిల్ 17), పరశురామ్ జయంతి (ఏప్రిల్ 28), మహారాణా ప్రతాప్ జయంతి (మే 9), జమాత్ ఉల్ విడా (జూన్ 23 - రంజాన్ మాసంలో చివరి శుక్రవారం), ఛత్ పూజా (అక్టోబర్ 26), ఈద్ మిలాద్ ఉన్ నబీ (డిసెంబర్ 2), చౌదరి చరణ్ సింగ్ జయంతి (డిసెంబర్ 23) సహా మరో 5 సెలవు దినాలున్నాయి. యూపీలో మొత్తం 42 పబ్లిక్ హాలిడేస్ ఉండగా, వాటిల్లో 17 వరకూ ప్రముఖుల జయంతి దినాలే. సవరించిన సెలవుల జాబితాను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని యూపీ సర్కారు ప్రకటించింది.

More Telugu News