: మంచి పని చేస్తూ చెడ్డపేరు తెచ్చుకోవడం ఎందుకు?: సీఎం చంద్రబాబు

మంచి పనులు చేస్తూ చెడ్డపేరు తెచ్చుకోవడం తగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం చంద్రబాబు తన నివాసం నుంచి అధికారులు, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచి పనులు చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సూచించారు. మిర్చి, పసుపు కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలని అన్నారు. అర్హులైన రైతులందరి నుంచి సరుకు కొనాల్సిందేనని తేల్చిచెప్పారు. రైతులు రోడ్లపై నిరీక్షించే పరిస్థితిని తీసుకురావద్దని సూచించారు.

హుద్ హుద్ తుపాను సమయంలో ఎంత అప్రమత్తంగా ఉన్నామో ఇప్పుడూ అలానే వ్యవహరించాలన్నారు. మార్కెట్ యార్డులలో అగ్నిప్రమాదం జరగకుండా పోలీసులు, అగ్నిమాపక శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మార్కెటింగ్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే రైతులకు 20 శాతం అధికంగా ధర వస్తుందన్నారు. రూ.1500 పథకం కోసం రిజిస్ట్రేషన్ నిబంధన ఎత్తివేయనున్నట్టు పేర్కొన్న సీఎం, గుంటూరు మార్కెట్ యార్డ్‌పై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. తెలంగాణ, ఒడిశాల నుంచి కూడా ఏపీ మార్కెట్ యార్డ్‌లకు సరకు వస్తోందని, పొరుగు రాష్ట్రాల నుంచి సరుకు తీసుకురావద్దని చంద్రబాబు సూచించారు.

More Telugu News