: రేపటి నుంచి ‘ఉడాన్’.. కడప-హైదరాబాద్ విమానాన్ని ప్రారంభించనున్న ప్రధాని!

గంట ప్రయాణానికి రూ.2,500 మాత్రమే వసూలు చేయాలనే ఉద్దేశంతో ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని మోదీ సర్కార్ గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం రేపటి నుంచి ప్రారంభం కానుంది. మొట్టమొదటి‘ఉడాన్’ ప్రాంతీయ విమానం సిమ్లా-ఢిల్లీ మధ్య రేపు ఎగరనుంది. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా, కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్ మధ్య తిరిగే ‘ఉడాన్’ విమానాలను ప్రధాని రేపు ప్రారంభించనున్నారు. కాగా, విమానాల్లో సుమారు ఐదు వందల కిలోమీటర్లకు సంబంధించి ఒక గంట ప్రయాణానికి రూ.2,500 వసూలు చేస్తారు. ప్రపంచ విమానయాన రంగంలో ఈ తరహా పథకాన్ని ప్రవేశపెట్టనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.

More Telugu News