: మంత్రి లోకేశ్‌ను పప్పు అనడంలో తప్పేంలేదు: ఉండవల్లి అరుణ్ కుమార్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తిని ప‌ప్పు అంటూ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు చేస్తోన్న విమ‌ర్శ‌ల ప‌ట్ల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ స్పందించారు. లోకేశ్‌ను పప్పు అనడంలో తప్పేంలేదని ఉండవల్లి అన్నారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్ర‌భుత్వం అతిగా స్పందించిందని వ్యాఖ్యానించారు. ఈ రోజు రాజ‌మ‌హేంద్రవ‌రంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

తాము అనేక అంశాలపై రాష్ట్ర స‌ర్కారుకి లేఖ రాశామ‌ని, అయిన‌ప్ప‌టికీ స్పందన రాలేదని ఆయ‌న చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర స‌ర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయ‌న అన్నారు. 2018 నాటికి గ్రావిటీ ద్వారా తాగునీరు వస్తుందని స‌ర్కారు అంటోంద‌ని, ఒక వేళ అలా చేయగలిగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్లన్నీ టీడీపీకే పడతాయని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాఫర్‌ డ్యామ్‌ ద్వారా నీళ్లు ఇస్తామని స‌ర్కారు చెబుతోంద‌ని, అసలు కాఫర్‌ డ్యామ్‌ ఎక్కడ ఉందని ఆయ‌న విమ‌ర్శించారు. అలాగే దేశమంతా ఒకేసారి ఎన్నికలు సాధ్యం కాదని ఆయ‌న వ్యాఖ్యానించారు.

More Telugu News