: మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి ఫలితం... ఆప్‌ ఎమ్మెల్యే అల్కాలంబా రాజీనామా

ఈ రోజు వెలువ‌డిన ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల ఫ‌లితాల్లో భార‌తీయ జ‌నతా పార్టీ విజ‌య దుందుభి మోగించిన విష‌యం తెలిసిందే. అయితే, త‌న‌ నియోజకవర్గంలోని మూడు వార్డుల్లో త‌మ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైన నేప‌థ్యంలో ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తాను ఎమ్మెల్యే, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు అల్కా లంబా తెలిపారు. కాగా, త‌మ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆమె చెప్పారు. అల్కాలంబా చాందీని చౌక్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విష‌యం తెలిసిందే. గతేడాది ఆప్‌ అధికార ప్రతినిధుల ప్యానెల్‌ నుంచి ఆమెను తొలగించారు.

More Telugu News