: అడవుల్లో మావోలతో పోరు కన్నా, జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులతో పోరాటం సులువు: సీఆర్పీఎఫ్ జవాను సంచలన వ్యాఖ్య

మూడు రోజుల క్రితం సుక్మా ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న జవాన్లు, నాటి భయానక పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. తమ వద్ద ఉన్న మందుగుండుతో రెండు గంటల పాటు మావోలతో పోరాడామని, దాడికి వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం, తమ వద్ద మందుగుండు అయిపోవడంతోనే మృతుల సంఖ్య పెరిగిందని గాయపడి రాయపూర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వ్యాఖ్యానించారు.

నాటి ఘటన గురించి చెబుతూ, మావోల నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తిన ప్రతి ఒక్కరూ వారి తూటాలకు బలయ్యారని, నాలుగు వైపుల నుంచి మావోలు చుట్టుముట్టారని, బ్యారల్ గ్రనేడ్ లాంచర్లు, ఏకే-47 తుపాకులతో విరుచుకుపడ్డారని తెలిపారు. ఇక గతంలో జమ్మూ కాశ్మీర్ లో పని చేసి, ఆపై నాలుగేళ్ల నుంచి బస్తర్ లో మావో వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్న మరో జవాను స్పందిస్తూ, అడవుల్లో మావోలతో పోరాటం కన్నా, కాశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరు సులువుగా ఉంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News