: స్టాచ్యు ఆఫ్ లిబర్టీ వద్ద ఫ్లైయింగ్ సాసర్... ఫోటోలో బందీ!

గ్రహాంతరవాసులు, ఎగిరే పళ్లేల గురించి విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. నాసా, ఇతర పరిశోధక సంస్థలు మాత్రమే కాకుండా పలు ప్రైవేట్ సంస్థలు కూడా వాటిపై నిజాలు నిగ్గుతేల్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సమీపంలో ఫ్లైయింగ్ సాసర్ వెళ్లడం ఆసక్తి రేపుతోంది. అమెరికాలోని న్యూయార్క్ లోని హడ్సన్ నదిలో ఒక వ్యక్తి ఆనందంగా బోటింగ్ చేస్తున్నాడు. దూరంగా కనిపిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత విగ్రహం ‘స్టాచ్యూ అఫ్ లిబర్టీ’ని చూస్తూ నేచర్ ను ఆస్వాదిస్తున్నాడు.

ఇంతలో ఊహించని విధంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి సమీపంలో అంతుచిక్కని కాంతిని గుర్తించాడు. వెంటనే తనదగ్గర ఉన్న కెమెరాను బయటకు తీసి, ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలను కెమెరాలో జూమ్ చేసి చూడగా, గుండ్రని వస్తువు నుంచి కాంతి వెదజల్లుతున్నట్టు గుర్తించాడు. ఇంటికి వెళ్లన ఆ వ్యక్తి ఆ ఫోటోలను కంప్యూటర్ కి అనుసంధానించి చూడగా, కాంతిని వెదజల్లే వస్తువు ఫ్లైయింగ్ సాసర్ గా గుర్తించాడు. దీంతో ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ డేట్ చేశాడు. ఈ ఫోటోలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి. 

More Telugu News