: భవిష్యత్ ఈ-ఫ్లైయర్స్ దేనేమో!...నేల, నీరు, గాలిలో ప్రయాణించే కారు...స్టార్టప్ సంస్థ ప్రయత్నం.. వీడియో ఇదిగో!

భవిష్యత్ లో ప్రతి ఒక్కరికీ సొంత ఫ్లయింగ్ కారు ఉంటుందని అమెరికాకు చెందిన స్టార్టప్ సంస్థ చెబుతోంది. 2017 చివరి నాటికి ఈ తరహా వాహనాలు అందుబాటులోకి వస్తాయని కాలిఫోర్నియా కేంద్రంగా ఊపిరిపోసుకున్న కిట్టీహాక్ అనే స్టార్టప్ సంస్థ చెబుతోంది. ఈ సంస్థ ఒక ఫ్లైయింగ్ కారును తయారు చేసింది. ఇందులో ప్రస్తుతానికి ఒక్కరే ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సంస్థ తయారు చేసిన ఫ్లైయింగ్ కారుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీనికి అనూహ్య స్పందన వస్తోంది. ఇది, నేల, నీరు, గాల్లో ప్రయాణం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండడం విశేషం.

ఈ సంస్థ ప్రయత్నానికి పూర్తి సహకారం అందిస్తామని గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీపేజ్ తెలపడం విశేషం. ప్రారంభ దశలో ఉన్న ఈ ఫ్లైయింగ్ కారుకు మరిన్ని పరీక్షలు నిర్వహించి పూర్తిస్థాయిలో విశ్వాసం ఏర్పడిన తరువాత మాత్రమే మార్కెట్ లోకి విడుదల చేయాలని ఆయన సూచించారు. 200 పౌండ్ల (100 కేజీల) బరువున్న ఈ ఫ్లైయింగ్ కారుకు ఎనిమిది రోటర్స్ ఉన్నాయి. ఇది గంటకి 25 మైళ్ల (40కి.మీ) వేగంతో, సుమారు 15 అడుగుల (4.5 మీటర్లు) ఎత్తులో ప్రయాణిస్తుందని కిట్టిహాక్ సంస్థ తెలిపింది. దీని ధర ఇంకా నిర్ణయించలేదని, అయితే వినియోగదారులకు అందుబాటులో తీసుకొచ్చే సమయానికి పూర్తి వివరాలు వెల్లడిస్తామని కిట్టీహాక్ సంస్థ తెలిపింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

More Telugu News