: 2,500 మంది నిరుద్యోగుల నుంచి 5,500 రూపాయల చొప్పున వసూలు చేసిన కంపెనీ

గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన గోటీజ్ అనే కంపెనీ సరికొత్త మోసానికి తెరతీసింది. విజయవాడలోని గాయత్రి నగర్ లో ఎలాంటి బోర్డు కానీ, ఇతర కార్యాలయ నిబంధనలు లేకుండా నిర్వహిస్తుండడంతో అనుమానం వచ్చి ఆరాతీయగా...గోటిజ్ కంపెనీ సౌత్ ఇండియా మొత్తం అఖిల్ అనే వ్యక్తికి ఫ్రాంఛైజీ ఇచ్చిందని చెప్పారు. ఇందులో మెంబర్ షిప్ కార్డ్స్ అని ఉంటాయని, ఆ కార్డ్స్ తీసుకుంటే కొంత మొత్తం చెల్లించాలని చెబుతారు. కొంత మొత్తం కట్టించుకుంటారు.

ఇన్ ఫ్రా, హోటల్, రిసార్ట్ బిజినెస్ చేస్తాయని, అందులో జనరల్ మేనేజర్ ఉద్యోగం కావాలంటే 5,500 రూపాయలు చెల్లించాలని నిరుద్యోగులకు ఆఫర్ ఇస్తున్నారు. ఇంటర్వ్యూ లేకుండా జనరల్ మేనేజర్ ఉద్యోగం కావాలంటే అదనంగా మరో 5,500 రూపాయలు చెల్లించాలని చెబుతున్నారు. ఇలా సుమారు 2,500 మంది ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు. దీంతో అనుమానితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అఖిల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంస్థ మెంబర్ షిప్ పేరుతో సుమారు ఎంతో మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. 

More Telugu News